సాగు నీరు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ప్రకటించిన ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక
విశాఖపట్నం , న్యూస్99:ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు ఇవ్వవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఉత్తరాంధ్రా అధ్యయన వేదిక ప్రకటించింది. నేడు రైల్వే న్యూ కోలనీ దరి ఓ ప్రవేటు హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూపీఎస్సీ మాజీ సభ్యులు డాక్టర్ కె ఎస్ చలం మాట్లాడుతూ గోదావరి నది అనగానే కేవలం ఉభయ గోదావరి జిల్లాల వరకే పరిమితం అనే విధంగా పాలకులు ప్రజల్లో దురభిప్రాయాన్ని కల్గించేశారన్నారు. దశాబ్దాల తరబడి ఇదే ఉద్దేశ్యంతో ఉత్తరాంధ్ర జిల్లాలు పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. అయితే గోదావరి జలాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల వాటా సంగతేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోదావరి జిల్లాల్లో మాత్రమే ఈ నది ఉండదని ఈ నది ఉపనది అయిన శబరి, గోస్తనీ తదితర ఉప నదులు కలిసిన తదుపరి గోదావరి విస్తృతంగా జీవ నదిగా మారి లక్షల హెక్టార్లకు సాగునీరు అందిస్తుందన్నారు. విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లోని అటవీ ప్రాంతం నుంచి జాలువారుతున్న ద్వారా గోదావరిలో కలిసి మహా నదిగా మారుతుందన్నారు. ఈ నది తీరంలో ఉత్తరాంధ్ర ఈ కార్యక్రమంలో డాక్టర్ నవీన ఫీల్డ్ ఘనంగా 'వ్యవసాయ క్షేత్రాలకు కనీస అవసరాలు తీర్చు వలసి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాలను పూర్తిగా విస్మరించిందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరువు రావడంతో పంటలు పండక రైతులు రైతు కూలీలు ఇతర దేశాలకు వలసలు పోవాల్సిన దౌర్భాగ్యం కలిగిందన్నారు. గతంలో భూములు దోచుకున్నారని, ఆ తర్వాత పంటలు దోచుకున్నారని ప్రస్తుతం నీరు కూడా దోచుకుంటున్నారన్నారు. ఇతర ప్రాంతాల'ప్రజా చైతన్య యాత్ర' నుంచి వచ్చిన వలసవాదుల ఆ కారణంగా స్థానికులు గిరిజనులు పూర్తిగా నిరాశ్రయులయ్యారు ఇతర ప్రాంతాలకు చెందిన వారు రాజకీయంగా తమ పలుకుబడి పెంచుకునేందుకు ఉత్తరాంధ్ర ఒక వాడుకోవడం చాలా బాధాకరమన్నారు. అయితే రాజకీయపరంగా స్థానికులు ఒక్క అడుగు ముందుకు వేసినా వలసవాదులు పారిపోవడం ఖాయం అన్నారు. గోదావరి జిల్లాల్లో గిరిజనులను విస్మరించి గోదావరి జలాలను ఇతర ప్రాంతాలకు తరలి పోతున్న నిస్సహాయ స్థితిలో స్థానికులు ఉన్నారన్నారు. రాజకీయపరంగా పూర్తిగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంట పొలాలకు తగిన నీరు అందించడం రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యత గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్ర వాటా ఎంత కచ్చితంగా తేల్చాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర స్థితిగతులపై త్వరలోనే ఒక సమగ్ర సర్వే నిర్వహించి విశ్లేషణతో ఒక ఒక నివేదికను తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భరణి కాన రామారావు, బొడ్డు కళ్యాణ్ రావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు.