'దివ్య' హంతకులను కఠినంగా శిక్షించాలి
ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ సహచర ఉద్యోగుల డిమాండ్
విశాఖపట్నం, న్యూస్ 99 : ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ గజ్వేల్ బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న దివ్యకు మరో వివాహం జరనుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై సహచర బ్యాంకు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ హంతకులను కఠినంగా శిక్షించా లని డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా విశాఖలోని ప్రాంతీయ కార్యాలయంలో సంతాప సభను నిర్వ హించారు. ఈ సంతాప సభలో బ్యాంకు రీజినల్ మేనేజర్ ఎం మనోహర్ రెడ్డి, అడ్మిన్ మేనేజర్ పి జగదీష్ బాబు తదితరులు పాల్గొని ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఎవరోకక్ష పూరితంగా ఆమెను హత్యచేసారని అటువంటి హంతకులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేసారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాధించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అడ్వాన్స్ మేనేజర్ కె భాస్కర ప్రసాద్, అధికారుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వై రమేష్ బాబు, ఉద్యోగుల సంఘ ప్రాంతీయ కార్యదర్శి కెవిఎస్పీఎన్ రాజు, అధికారుల సంఘం ప్రాంతీయ కార్యదర్శి శివసతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.