నిష్ణాతులకు  విశాఖ సమాచారమ్  ఉగాది పురస్కారాలు

వివిధ రంగాల్లోని నిష్ణాతులకు, సేవా తత్పరులకు ప్రతీఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు విశాఖ సమాచారమ్ దినపత్రిక సంపాదకులు, పురస్కారాల కమిటీ ఛైర్మన్ సూరంపూడి వీరభద్రరావు చెప్పారు. సోమవారం పిఠాపురం కోలనీలోని విశాఖ సమాచారమ్ దినపత్రిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గత 22 ఏళ్లగా 250 మందికి పైగా పురస్కారాలు అందజేశామని ఈ ఏడాది కూడా ఉత్తమ పౌరుడు, ఉత్తమ మహిళ, ఉత్తమ అధికారి, ఉత్తమ ప్రజాప్రతినిధి, ఉత్తమ స్వచ్చంద సేవాసంస్థ తదితర విభాగాల్లో ఎంపిక చేసిన వారిని సన్మానిస్తామని తెలిపారు. సమాజంలో పేదలు, బడుగులు, బలహీనవర్గాల ప్రజలకు విభిన్న రంగాల్లో సేవలందిస్తున్న వారికి ఈ పురస్కారాలు అందిస్తామని మరికొంతమందికి ప్రోత్సాహక పురస్కారాలు కూడా ప్రదానం చేస్తామని తెలిపారు. అర్హులైన వారిని ఉగాది పురస్కారాల కమిటీ ఎంపిక చేస్తుందని తెలిపారు. ఆయా రంగాల్లో నిపుణులైన వారు ఈ నెల 15వ తేదీలోగా తమ దరఖాస్తులను ఫోటోతో పాటు విశాఖ సమాచారమ్ దినపత్రిక కార్యాలయం, సూరంపూడి విశ్వేశ్వరరావు భవన్ డో.నెం. 9-3-16, పిఠాపురం కోలనీ, విశాఖపట్నం చిరునామాకు పోస్టు ద్వారా గాని, వాట్సాప్ ద్వారా గాని తెలియజేయాలని 9393949345కి కూడా సంప్రదించవచ్చని చెప్పారు. ఉగాది సందర్భంగా ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని తెలియజేశారు.