జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా జనసేన పార్టీ తరపున స్థానిక ఎన్నికల బరిలో టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కణితి కిరణ్ అలాగే ఆ పార్టీ టెక్కలి నియోజకవర్గ సీనియర్ నాయకుడు కూరాకుల యాదవ్ ప్రోద్బలంతో నియోజకవర్గం లోని 3 జడ్పిటిసీ స్థానాలకు, 18 ఎంపీటీసీ స్థానాలకు జనసేన పార్టీ తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇదిలా ఉండగా టెక్కలి నియోజకవర్గ జనసేన పార్టీ కీలక నేత అట్టాడ శ్రీధర్ సంతబొమ్మాళి జడ్పీటీసీ స్టానం కోసం పోటీపడుతుండటంతో ఆ మండలంలో ఇప్పుడు ప్రత్యర్ధుల్లో గుబులు పెరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత సంతబొమ్మాళి మండలంలోని తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో జనసేన పార్టీ విస్తృతంగా తిరిగి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కష్టపడుతుందని పేరు సంపాదించడమే ముఖ్య కారణంగా తెలుస్తుంది. అలాగే శ్రీధర్ సతీమణి మార్పు ప్రమీల రాణి కూడా టెక్కలి జడ్పిటీసీ స్టానం బరిలో నిలిచింది. టెక్కల్లో బడా నాయకుల గ్రూపు తగాదాలు వీరికి ఈ సందర్భంగా కలిసొచ్చే అంశమని పలువురు ఓటర్లు భావిస్తున్నారు. అలాగే కోసం పార్టీకోసం మొదటినుంచి కష్టపడ్డ యువకుడు పాగోటి అనిల్ కుమార్ కోటబొమ్మాళి జడ్పిటిసీ స్థానం బరిలో నిలిచారు. వీరంతా నామినేషన్ల చివరిరోజు అయన బుధవారం శ్రీకాకుళంలో తమ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే టెక్కలి మండలంలోని ఎంపీటీసీ ప్రాదేశిక 3 కోసం కూడా అట్టాడ శ్రీధర్ తన నామినేషన్ దాఖలు చేశారు..
అట్టాడ శ్రీధర్ నామినేషన్ దాఖలు